BIKKI NEWS (MAY 03) : LICENCED SURVEYOR TRAINING 2025. తెలంగాణ రాష్ట్రంలో లైసెన్సుడ సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ ప్రకటన విడుదల చేసింది.
LICENCED SURVEYOR TRAINING 2025
ఇంటర్మీడియట్ లో ఎంపీసీ 60 శాతం మార్కులు కలిగిన వారు, ఐటిఐ డ్రాప్ట్స్ మెన్ (సివిల్), డిప్లొమా (సివిల్), బిటెక్ (సివిల్) లేదా తత్సమాన అర్హత కలిగిన వారు ఈ శిక్షణ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత కలిగిన అభ్యర్థులు మే 5 నుంచి 17వ తేదీ వరకు మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు 100/- రూపాయలుగా నిర్ణయించారు
ఎంపికైన అభ్యర్థులకు 50 పని దినాలలో శిక్షణ ఇస్తారు. శిక్షణ కొరకు ఓసి అభ్యర్థులు 10 వేల రూపాయలను, బీసీ అభ్యర్థులు 5 వేల రూపాయలను, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 2500 రూపాయలను ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తి వివరాల కోసం 9849081489, 9441947399, 7032634404 నెంబర్లలో సంప్రదించవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 1000 సర్వేయర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో.. శిక్షణ పొంది సర్టిఫికెట్లు పొందిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హత సాధించవచ్చు.
- GOLD RATE – తగ్గిన బంగారం, వెండి ధరలు
- TGPSC – త్వరలో 166 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
- ASHA WORKER JOBS – కాకినాడ జిల్లాలో ఆశా వర్కర్ జాబ్స్
- INTERMEDIATE – విలీనం పై ప్రభుత్వం సంకేతాలు
- JOBS – ఆర్కేపురం ఆర్మీ స్కూలులో జాబ్స్