లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)కి చెందిన గోల్డెన్ జూబ్లి పౌండేషన్ 2020 విద్యా సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ఇంటర్మీడియట్, పదవ తరగతి ఉత్తీర్ణత సాదించిన విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి స్కాలర్షిప్ ఇస్తుంది…
● మొత్తం స్కాలర్షిప్ల సంఖ్య ::
1) దేశవ్యాప్తంగా LIC డివిజనల్ సెంటర్ ఒక్కోదానికి 20 చొప్పున రెగ్యులర్ స్కాలర్షిప్లు(బాలురు-10, బాలికలు-10).
2) ప్రతి LIC డివిజన్ పరిధిలో కేవలం బాలికలకు 10 ప్రత్యేక స్కాలర్షిప్స్ (పదోతరగతి పూర్తి చేసిన వారికి).
● అర్హత ::
కనీసం 60% మార్కులతో 2019-20 విద్యాసంవత్సరంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాదించి ఉండాలి.
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ సంస్థల్లో ఒకేషనల్/ ఐటీఐ సంబంధిత కోర్సులు చదువుతూ ఉండాలి.
ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా/ తత్సమాన ఉన్నత విద్య చదువుతూ ఉండాలి.
● దరఖాస్తు విధానం :: ఆన్లైన్.
● చివరి తేది :: 31.12.2020.
● అప్లికేషన్ నింపడానికి వెబ్సైట్ ::
https://licindia.in/Golden-Jubilee-Foundation
