సంవత్సరానికి 20 వేల LIC స్కాలర్ షిప్ పథకం

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) 2021 సంవత్సరానికి గాను గోల్డెన్ జూబ్లీ స్కాలర్ షిప్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

● అర్హత :: 2020 – 21 విద్యాసంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి/ ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత.

తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు మించకుండా ఉండాలి.

● ఎవరికి :: మెడిసిన్/ ఇంజినీరింగ్/ ఏదైనా గ్రాడ్యుయేషన్/ ఇంటిగ్రేటెడ్ కోర్సులు/ ఏదైనా విభాగంలో డిప్లొమా/ తత్సమాన కోర్సులు/ ఒకేషనల్ కోర్సులు (ఐటీఐల్లో) చదువుతున్న విద్యార్ధులకు ఈ ఉపకార వేతనాలు అందజేస్తారు.

● బాలికలకు ప్రత్యేక ఉపకారవేతనాలు :: పదో తరగతి ఉత్తీర్ణులై ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికలు ఈ స్కాలర్ షిప్స్ కి అర్హులు.

2020 – 21 విద్యాసంవత్సరానికి 60శాతం మార్కులతో పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు మించకుండా ఉండాలి.

● స్కాలర్షిప్ వ్యవధి :: రెగ్యులర్ స్కాలర్ షిప్స్ కి సంబంధిత కోర్సు పూర్తయ్యేవరకు అందిస్తారు. బాలికలకు ప్రత్యేకంగా అందించే ఉపకారవేతనాలు రెండు సంవత్సరాల వరకు అందిస్తారు.

● ఉపకార వేతనాల మొత్తం: రెగ్యులర్ స్కాలర్స్ కి ఏడాదికి రూ. 20,000 మూడు వాయిదాల్లో అందిస్తారు.

ప్రత్యేకంగా బాలికలకు అందించే మొత్తాన్ని ఏడాదికి రూ.10000 మూడు వాయిదాల్లో అందిస్తారు.

● ఎంపిక విధానం: 10/ 10+2లో సాధించిన మెరిట్ మార్కులు, తల్లిదండ్రుల కుటుంబ వార్షికాదాయం ఆధారంగా.

● దరఖాస్తు విధానం :: ఆన్లైన్

● చివరి తేది :: డిసెంబరు – 31 – 2021

● వెబ్సైట్ :: https://licindia.in

Follow Us @