హైదరాబాద్ (ఎప్రిల్ – 21) : కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, కమిషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పరిధిలో లైబ్రరేయన్ పోస్టుల (LIBRARIAN POSTS EDIT OPTION) భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను తమ వివరాలను ఎడిట్ చేసుకునే అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కల్పించింది.
ఏప్రిల్ 25 నుండి 27వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్లైన్ ద్వారా తప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని టిఎస్పిఎస్సి కల్పించింది. ఒక్కో అభ్యర్థికి ఒకసారి మాత్రమే ఎడిట్ ఆప్షన్ అవకాశం కల్పించినట్లు ప్రకటనలో తెలిపింది.