అమెరికా ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్రమోదీని అత్యున్నత పురస్కారం ‘లీజియన్ ఆఫ్ మెరిట్’ తో సత్కరించింది. ప్రతిష్టాత్మక అవార్డును అందించింది. ప్రధాని మోదీ తరఫున ఈ అవార్డును తరణ్జిత్ సింగ్ సంధూ శ్వేతసౌధంలో స్వీకరించారు.
అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడంలో మోడీ కృషి చేసినందుకు ఈ అవార్డును అందజేసినట్లు ఓబ్రియన్ తెలిపారు.
మోడీ తో పాటు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేలకు ఈ పురస్కారాలు లభించాయి.
ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ పలు దేశాల నుంచి అందుకున్న అవార్డులు.
- 2016 లో సౌదీ అరేబియా ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్, అదే సంవత్సరంలో ‘ఘాజీ ఆమిర్ అమానుల్లాఖాన్ స్టేట్ ఆర్డర్’ అవార్డును స్వీకరించారు.
- 2018లో గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా,
- 2019 లో యూఏఈ ఆర్డర్ ఆఫ్ ది జాయెర్ అవార్డు,
- రష్యా ఆర్డర్ ఆఫ్ ఎండ్రు పురస్కారం
- మాల్దీవుల అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు.