త్వరలో లెక్చరర్ ల బదిలీలు.!

హైదరాబాద్ (సెప్టెంబర్ – 07) : ఉపాధ్యాయుల బదిలీలకు షెడ్యూలు విడుదలై ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్లకు కూడా బదిలీలు చేపట్టాలని సంబంధిత సంఘాల నేతలు విద్యాశాఖ పై ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులకు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి సూచించినట్లు సమాచారం.

చివరిసారిగా సాధారణ బదిలీలు 2018 సంవత్సరంలో జరిగాయి. తదనంతరం 317 జీవో అమలు కారణంగా బదిలీలు జరిగాయి. కాకపోతే 317 జీవో వలన జరిగిన బదిలీలు చాలామంది ఇబ్బంది పడ్డట్లు పలు సంఘాల నేతలు తెలిపారు.

అలాగే జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ క్రమబద్ధీకరణ కాపాడిన నేపథ్యంలో వీరికి కూడా బదిలీలకు అవకాశం ఇవ్వడం ద్వారా అందరికీ సమన్యాయం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.