హైకోర్టు తీర్పు పట్ల లాయర్ జీవిఎల్. మూర్తి స్పందన

  • 475 సంఘం తరపున వాదించిన ప్రఖ్యాత లాయర్ జీవిఎల్ మూర్తి.
  • కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కీలక కేసులో విజయవంతంగా వాదనలు వినిపించిన లాయర్ మూర్తి

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కొరకు 2016లో జీవో నెంబర్ 16 ను విడుదల చేసింది.

ఈ జీవోను సవాలు చేస్తూ 2016 లోనే శంకర్ మరియు గోవింద్ రెడ్డి అనే నిరుద్యోగులు గౌరవ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తే దానిని హైకోర్టు విచారణకు స్వీకరించలేదు… ఈ నేపథ్యంలో వారు ప్రజా ప్రయోజన వ్యాజ్యం రూపంలో మరొక కేసును దాఖలు చేయడం జరిగింది.

ఈ పిల్ ను స్వీకరించిన హైకోర్టు జీవో నెంబర్ 16 నిలుపుదల చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి అనేక వాయిదాల పడుతూ వచ్చిన ఈ కేసు గతంలో ప్రధాన హైకోర్టు న్యాయమూర్తి హిమ కోహ్లీ బేంచ్ మీదకు విచారణకు వచ్చినప్పుడు రిట్ పిటిషన్ మరియు పిల్ వేసినది ఒకే పార్టీ అని తెలిసి రిట్ పిటిషన్ కొట్టివేస్తూ జరిమానా కూడా విధించడం జరిగింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ సతీష్ చంద్ర శర్మ, న్యాయమూర్తి జస్టిస్ యన్. తుకారం జీ ల బేంచ్ మీదకు ఈరోజు సంబంధిత ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణకు రాగా రిట్ పిటిషన్ మరియు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసింది ఒకే పార్టీ కావున గతంలో ఛీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ ఇచ్చిన తీర్పును ప్రస్తుత పిల్ కు అన్వయిస్తూ కొట్టివేయడం జరిగింది.

PLEASE DOWNLOAD “bikki news app” for daily updates

ఈ జీవో నంబర్ – 16 కి సంబంధించిన మరికొన్ని చిన్న చిన్న పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని వాటిని కూడా అతి త్వరలోనే హైకోర్టు కొట్టి వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని… ప్రధానమైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం కొట్టివేత తో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రధాన అడ్డంకి తొలగిందని… ప్రభుత్వం ఇప్పుడు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరుపుకోవచ్చని లాయర్ జీ.వి.ఎల్. మూర్తి తెలిపారు.

Follow Us @