BIKKI NEWS : LATEST CURRENT AFFAIRS IN TELUGU 9th OCTOBER 2024
LATEST CURRENT AFFAIRS IN TELUGU 9th OCTOBER 2024
1) ఉత్తర కొరియా ఏ దేశంతో తన సరిహద్దులను పూర్తిగా మూసివేసింది.?
జ : దక్షిణ కొరియాతో
2) టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఎవరు అలెస్టర్ కుక్ రికార్డును బ్రేక్ చేశారు.?
జ : జో రూట్
3) 2025 జనవరిలో జరిగే జాతీయ క్రీడలకు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : జార్ఖండ్
4) ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని ట్రకోమా వ్యాధి నుండి పూర్తిగా బయటపడిన దేశంగా తాజాగా ప్రకటించింది.?
జ : భారత్
5) ఆర్బిఐ అంచనాల ప్రకారం వచ్చే ఐదేళ్లలో ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ విలువ ఎన్ని వేల కోట్లకు చేరుకొనుంది.?
జ : 74 వేల కోట్లు
6) ఆర్బిఐ అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం ఎంతగా నమోదు కానుంది.?
జ : 4.5%
7) ఆర్బిఐ అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత అభివృద్ధి రేటు ఎంతగా నమోదు కానుంది .?
జ : 7.1%
8) భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపిఓగా ఏ ఐపిఓ నిలవనుంది.?
జ : హ్యుందాయ్ (27,870 కోట్లు)
9) అక్టోబర్ 13 నుండి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మ్ ఆఫ్రికాలోని ఏ దేశాలలో పర్యటించనుంది.?
జ : అల్జీరియా, మౌరిటానియా, మాలావి
10) ఆసియాలోనే అతి పెద్దదైన గామా రే ఇమేజింగ్ టెలిస్కోఫ్ ను భారత దేశంలో ఎక్కడ ఏర్పాటు చేశారు.?
జ : లద్దాఖ్
11) వ్యాపార దిగ్గజం టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా(86) కన్నుమూశారు. ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ తో భారత్ ప్రభుత్వం అందజేసింది.?
జ : 2008
12) దేశీయంగా రూ.45 వేల కోట్ల వ్యయంతో రెండు నూక్లియర్ సబ్ మెరైన్లను ఎక్కడ నిర్మించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.?
జ : విశాఖలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో
13) ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన, ఇతర సంక్షేమ కార్యక్రమాల కింద ఉచితంగా సరఫరా చేస్తున్న బియ్యం పథకాలను ఎప్పటి వరకు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.?
జ : 2028 డిసెంబర్ వరకు
14) ప్రొటీన్లపై జరిపిన పరిశోధనలకు గానూ రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. వారు ఎవరు.?
జ : డేవిడ్ బేకర్, డెమిస్ హస్సబిస్, జాన్ జంపర్
15) 18 ఏళ్ల వయసులోనే 14 పర్వతాలను అధిరోహించాడు. 7వేల మీటర్ల ఎత్తు కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న శిఖరాలను ఎక్కేశాడు.?
జ : నిమా రింజి షెర్పా
16) ధ్వని వేగానికి మించిన వేగంతో ప్రయాణించే ‘హైపర్‌సానిక్ జెట్’ ను ఏ స్టార్టప్ తయారు చేసింది.?
జ : ‘వీనస్ ఏరోస్పేస్’
17) ఇజ్రాయెల్ సరికొత్త రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసింది. లేజర్ లైట్‌తో డ్రోన్లను కూల్చగలిగే ఏ వ్యవస్థను తయారుచేసింది.?
జ : లైట్ బీమ్ లేజర్ ఇంటర్‌సెప్షన్
18) తాజాగా ఆర్బీఐ రెపోరేటు ఎంతగా ప్రకటించింది.?
జ : 6.5 శాతం
19) యూపీఐ లైట్ వ్యాలెట్‌కున్న పరిమితిని ఆర్బీఐ ఎంతకు పెంచింది.?
జ : రూ.5,000
20) ఏషియన్ టీటీ చాంపియన్‌షిప్ 2024లో భారత మహిళల జట్టు ఏ పతకం దక్కించుకుంది.?
జ : కాంస్య పతకం