LATEST CURRENT AFFAIRS IN TELUGU 11th OCTOBER 2024

BIKKI NEWS : LATEST CURRENT AFFAIRS IN TELUGU 11th OCTOBER 2024

LATEST CURRENT AFFAIRS IN TELUGU 11th OCTOBER 2024

1) వంద సంవత్సరాల క్రితం ఎవరెస్ట్ పర్వతంపై తప్పిపోయిన బ్రిటిష్ పర్వతరోహకుడి ఆనవాళ్లు తాజాగా లభించాయి.?
జ : శాండీ ఇర్విన్

2) 2024 జనవరి నుంచి జూన్ వరకు యూపీఐ లావాదేవీలు విలువ ఎంత.?
జ : 87.97 బిలియన్స్

3) టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఇన్నింగ్స్ లో 500 పరుగులు సాధించి కూడా ఇన్నింగ్స్ తేడాతో ఓడిన తొలి జట్టుగా ఏ జట్టు రికార్డు సృష్టించింది.?
జ : పాకిస్థాన్

4) ఏ రాష్ట్రంలో స‌మ‌గ్ర కుల‌గ‌ణ‌న‌ జరపాలని తాజాగా నిర్ణయం తీసుకుంది.?
జ : తెలంగాణ

5) తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు సంబంధించి ప్ర‌భుత్వం ఎవరి నేతృత్వంలో కమిషన్ ను నియ‌మించింది. ?
జ : హైకోర్టు విశ్రాంత జ‌డ్జి జ‌స్టిస్ ష‌మీమ్ అక్త‌ర్‌

6) ఏ రాష్ట్ర ప్రభుత్వం దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌టాటా స్మార్థకార్థం పారిశ్రామిక అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.?
జ : మహారాష్ట్ర ప్రభుత్వం

7) నోబెల్ శాంతి బహుమతి 2024 ను ఎవరికి ప్రకటించారు.?
జ : జపాన్ కు చెందిన నిహన్ హిండాక్యో సంస్థ కు

8) నిహన్ హిండాక్యో సంస్థ చేస్తున్న కృషి ఏమిటి.?
జ : అణు దాడి బాధితులకు‌, అణ్వాయుధాలకు వ్యతిరేకంగా పని చేస్తోంది.

9) రోబో ట్యాక్సీ, రోబో వ్యాన్‌ను ఎవరు తాజాగా ప్రపంచానికి పరిచయం చేశారు.?
జ : ఎలాన్‌ మస్క్‌

10) డోరేమాన్‌ కార్టూన్‌ షోలో డోరేమాన్‌ పాత్రకు డబ్బింగ్‌ చెప్పిన ఏ జపాన్‌ మహిళ మరణించారు.?
జ : నోబుయో ఒయామా

11) టాటా ట్రస్ట్స్‌నూతన చైర్మన్‌ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : నోయెల్‌ టాటా

12) ప్రపంచ ఆకలి సూచీ 2024 లో 127 దేశాలకు గానూ భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : 105

13) చైల్డ్ వేస్టింగ్ రేటు (చిన్నారులు ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం) లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది.?
జ : మొదటి స్థానంలో

14) రాజ్యసభ నైతిక విలువల కమిటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఘనశ్యాం తివారీ (బీజేపీ ఎంపీ)

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు