BIKKI NEWS (APRIL 18) : లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డుకు అమితాబ్ బచ్చన్, ఏఆర్ రెహమాన్, ‘దీప్‌స్తంభ్ ఫౌండేషన్’ మనోబల్ లు (Lata Mangeskar Award for Amitab and AR Rehaman and Manobal) ఎంపిక అయ్యారు.
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వివిధ రంగాల్లోని ప్రతిభావంతులకు, సమాజానికి సేవలందిస్తున్న వారికి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ పురస్కారాన్ని అందజేస్తున్నారు. తొలుత ఈ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు
ఆ తర్వాత లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లే ఈ పురస్కారం అందుకున్నారు. 2024కి గాను అమితాబ్ బచ్చన్‌కి ‘లతా దీనానాథ్ మంగేష్కర్’ అవార్డు ఇవ్వనున్నట్లు లతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు ప్రకటించారు. అదే విధంగా భారతీయ సంగీతానికి చేసిన కృషికిగానూ ఏఆర్ రెహమాన్ కూడా ఈ పురస్కారం అందుకుంటారు.
LataMangeskar Award Winners
2022 – నరేంద్ర మోదీ
2023 – ఆశా భోంస్లే
2024 – అమితాబ్ బచ్చన్, ఏఆర్ రేహమన్, మనోబల్