జూనియర్ కళాశాలల పని దినాలు పెంచుతూ ఉత్తర్వులు.

తెలంగాణ లోని జూనియర్ కళాశాలలో పనిదినాలను ఏప్రిల్ 30 వరకు పెంచుతూ ఇంటర్మీడియట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2020 – 21 విద్యా సంవత్సరానికి గాను ఏప్రిల్ 16 తో విద్యా సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

పర్యావరణ విద్య, నైతికత మానవ విలువలు పరీక్షల అసైన్మెంట్ లను విద్యార్థులు ఇంకా కళాశాలలకు సబ్మిట్ చేయవలసిన నేపథ్యంలో చివరి పని దినాన్ని ఏప్రిల్ 30 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఈ సమయంలో కేవలం ఆన్లైన్ తరగతులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు కళాశాలలకు హాజరు నుండి మినహాయింపు కలదు. టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది ఖచ్చితంగా ఏప్రిల్ 30 వరకు కళాశాలకు హాజరవ్వాలి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Follow Us @