BIKKI NEWS (నవంబర్ – 24) : అంతరిక్షంలోని 16 మిలియన్ కిలో మీటర్ల దూరం నుంచి భూమిపైకి తొలి లేజర్ సందేశం అందిందని (LASER MESSAGE FROM SPACE – NASA) నాసా ప్రకటన విడుదల చేసింది.
ఇది భూమి, చంద్రుడి మధ్య దూరం కంటే 40 రెట్లు ఎక్కువ. ఇది ఆప్టికల్ కమ్యూనికేషన్ రంగంలోనే అతి గొప్ప మైలురాయి.
ఈ ప్రయోగం డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ (డీఎస్ఓసీ) అనే సాధనం ద్వారా సాధ్యమైంది. ఈ సాధనాన్ని ఈ ఏడాది అక్టోబర్ 13న ఫ్లోరిడా లోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుండి అంతరిక్షంలోకి ప్రయోగించిన సైక్ స్పేస్ క్రాఫ్ట్ లో పంపించారు. ఆ మరుసటి రోజు నుంచే ఈ సాధనం లేజర్ సందేశాన్ని భూమి పైకి పంపిస్తున్నది.