జంతువుల సంఖ్య, జాతులపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద జూ ( జంతు శాల) గుజరాత్ లోని జామ్నగర్లో రాబోతున్నది. ఈ జూ ఏర్పాటుకు సెంట్రల్ జూ అథారిటీ (CZA) ఆమోదం తెలిపింది.
CZA ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గుజరాత్లోని జామ్నగర్ వద్ద ‘గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కింగ్డమ్’ అనే పేరుతో మెగా జూను ఏర్పాటు చేయబోతున్నది. ఈ జూ 250.1 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.