Home > CURRENT AFFAIRS > REPORTS > FERTILITY RATE REPORT 2023 – LANCET

FERTILITY RATE REPORT 2023 – LANCET

BIKKI NEWS (MARCH 22) : భారత దేశంలో వివిధ కారణాల వలన సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గిందని భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని లాన్సెట్ రిపోర్ట్ (lancet fertility rate report 2023 of india) వెల్లడించింది.

గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్(GBD) అనే సంస్థ యొక్క పరిశోధకులు చేసిన అధ్యయనంలో కీలకమైన విషయాలు వెల్లడయ్యాయి.

★ నివేదిక ప్రధానాంశాలు

మన దేశంలో 1950 సంవత్సరంలో 6.2% గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 2.0 దిగువకు తగ్గిపోయిందని ఈ అధ్యయనం పేర్కొన్నది. ఇది మరింత తగ్గబోతున్నదని, 2050 నాటికి 1.29కి, 2100 సంవత్సరానికికి 1.04కి తగ్గుతుందని అంచనా వేసింది.

1950లో భారత్ లో ఒక మహిళ సగటున 4.8 పిల్లలకు జన్మనిస్తే.. 2021 నాటికి 2.2 పిల్లలకు జన్మనిచ్చిందని పేర్కొన్నది. ఇది మరింత తగ్గిపోనున్నదని, 2050 నాటికి ఒక మహిళ సగటున 1.8 మందికి, 2100 సంవత్సరం నాటికి 1.6 మందికి జన్మనివ్వవచ్చని ఈ అధ్యయనం అంచనా వేసింది.

ప్రపంచంలో 1950లో 9.3 కోట్ల మంది జన్మించగా.. 2016లో అత్యధికంగా 14.2 కోట్ల మంది జన్మించారు. 2021 నాటికి జననాల సంఖ్య 12.9 కోట్లకు తగ్గిపోయింది.

భారత్ లో 1950లో 1.6కోట్ల మంది జన్మించగా. 2021లో 2.2 కోట్ల మంది జన్మించారు. 2050లో 1.3 కోట్ల మంది జన్మించివచ్చని ఈ సంస్థ అంచనా వేసింది.

21వ శతాబ్దంలో చాలా దేశాలు తక్కువ సంతానోత్పత్తి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ అల్పాదాయ దేశాలు మాత్రం అధిక సంతానో త్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్నాయని జీబీడీ పేర్కొన్నది.

2021లో మొత్తం ప్రపంచ జననాల్లో పేద దేశాల్లో 18 శాతం ఉండగా, 2100 నాటికి 35 శాతం వరకు పెరగవచ్చని అంచనా వేసింది.