15 నుండి ప్రాక్టికల్ తరగతులు

కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ (KVS) పరిధిలోని విద్యాలయాలు రాష్ట్రాల అనుమతితో 10వ, 12వ తరగతుల విద్యార్థులకు డిసెంబర్ 15 నుంచి ప్రాక్టికల్ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

కరోనా నిబంధనలతో ప్రాక్టికల్ తరగతులు నిర్వహించాలని కేంద్రీయ విద్యాలయ అధికారులు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారు. దీని ప్రకారం విద్యార్థులను చిన్న చిన్న గ్రూపులుగా తయారు చేసి ప్రాక్టికల్ తరగతులు నిర్వహించనున్నారు.

బోర్డు పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులకు థీయరీ ఆన్లైన్ పద్దతిలో బోధిస్తున్నప్పటికి ఇంతవరకూ ప్రాక్టికల్ తరగతులు నిర్వహించలేదు. దీనితో ప్రత్యేక ప్రణాళిక ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్ తరగతులు నిర్వహించాలని కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ నిర్ణయం తీసుకుంది.

Follow Us@