హైదరాబాద్ (నవంబర్ – 28) : కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్ష ఫలితాలు (KVS JOBS RESULTS DIRECT LINKS) వెల్లడయ్యాయి. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ప్రస్తుతానికి టీజీటీ, లైబ్రేరియన్, హిందీ ట్రాన్స్లేటర్, ప్రైమరీ టీచర్ ఫలితాలు వెలువడగా.. మిగిలిన పోస్టుల ఫలితాలు త్వరలోనే విడుదల చేయనున్నారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేయనున్నారు.