న్యూడిల్లీ (ఎప్రిల్ – 21) : దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 13,404 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు, కటాఫ్ మార్కులు, ఇంటర్వ్యూ తేదీ, వేదికలను వెబ్సైట్లో పెట్టారు. మొత్తం 13,404 ఉద్యోగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 1,409, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు 3,176 ఉన్నాయి. వీటికి ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహించారు.