10కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రత సృష్టించే సౌత్ కొరియా ప్రాజెక్టు పేరు.?

విద్యుత్ కష్టాలను పరిష్కరించడంలో భాగంగా దక్షిణ కొరియా కొన్ని సెకండ్ ల పాటు కృత్రిమ సూర్యుడిని సృష్టించడం ద్వారా 10 కోట్ల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను పుట్టించి విద్యుత్ శక్తిగా మార్చేందుకు ‘కేస్టార్’ పేరిట భారీ ప్రాజెక్టు ను ప్రారంభించింది.

KSTAR : (Korea Superconducting Tokamak Advanced Research)

2026 నాటికి చేపట్టబోయే ఈ ప్రయోగ వివరాలను 16వ నేషనల్ ఫ్యూజన్ కమిటీ సమావేశంలో అధికారులు వెల్లడించారు. అణువిచ్ఛేదన సాంకేతికత సాయంతో వాణిజ్య అవసరాల కోసం విద్యుత్తును పెద్దమొత్తంలో సృష్టించాలంటే 10 కోట్ల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను కనీసం 300 సెకండ్లపాటు కొనసాగేలా చేయాలి.

ఇందులో భాగంగా 2018లో తొలిసారిగా కొరియా అధికారులు కృత్రిమ సూర్యుడి సాయంతో 1.5 సెకండ్లపాటు 10 కోట్ల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను సృష్టించారు. 2020లో దీన్ని 20 సెకండ్లకు పెంచారు.

Follow Us @