హైదరాబాద్ (జూలై – 23) : కోరియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్స్ షిప్ 2023 పురుషుల డబుల్స్ విజేతలుగా భారత స్టార్ జోడి సాత్విక్ సాయిరాజ్ & చిరాగ్ శెట్టి జోడి ప్రపంచ నంబర్ వన్ జోడి అయిన అల్పియన్ & ఆర్డియాంటో జోడి పై సంచలన విజయం నమోదు చేసి విజేతగా నిలిచారు. పురుషుల సింగిల్స్ విజేతగా అంటోన్‌సెన్, మహిళ సింగిల్స్ విజేతగా యస్. వై. అన్ నిలిచారు.
పురుషుల డబుల్స్ విజేతలుగా భారత స్టార్ జోడి సాత్విక్ సాయిరాజ్ & చిరాగ్ శెట్టి జోడి ప్రపంచ నంబర్ వన్ జోడి అయిన అల్పియన్ & ఆర్డియాంటో జోడి పై 17 – 21, 21 -13, 21 -14 తేడాతో నెగ్గారు. ఇది భారత జోడి కి ఈ ఏడాది మూడో టైటిల్ కావటం విశేషం
పురుషుల సింగిల్స్ విజేతగా ఏ. అంటోన్‌సెన్ నిలిచాడు. హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కే. వై లోహ్ పై 11 – 21, 21 – 11, 19 – 21 తేడాతో గెలిచి విజేతగా నిలిచాడు.
మహిళల సింగిల్స్ విజేతగా యస్. వై. అన్ నిలిచింది. టీవై థాయ్ పై వరుస సెట్లలో 21 – 9, 21 – 15 తేడాతో నెగ్గింది.
మహిళల డబుల్స్ విజేతగా వై.యఫ్ జియా – క్యూసీ చెన్ జోడి ఫైనల్ లో కిమ్ & కాంగ్ జోడిని ఓడించి విజేతగా నిలిచింది.
మిక్స్‌డ్ డబుల్స్ లో వేయ్ & జియాంగ్ జోడిపై హుహంగ్ & ఫెంగ్ జోడి గెలిచి విజేతగా నిలిచింది.