గొల్లపెల్లి కళాశాల అభివృద్ధికి కృషి – మంత్రి కొప్పుల ఈశ్వర్

జగిత్యాల జిల్లాలోని గొల్లపెల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల – గొల్లపెల్లి అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు, ధర్మపురి శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఏనుగుల మల్లయ్య తెలిపారు .

శుక్రవారం రోజున కరీంనగర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం మంత్రి కొప్పుల ఈశ్వర్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కళాశాల స్థితిగతులు , విద్యార్థుల సంఖ్య, కళాశాల సమస్యలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలకు ప్రహరీ గోడ మంజూరు చేసినట్లు త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టి త్వరితగతిన పూర్తిచేయడానికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు.


ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఏనుగుల మల్లయ్య, లెక్చరర్లు వెంకట కృష్ణారెడ్డి ,రాజ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us@