కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలలో మౌళిక వసతులు పెంచాలి – కొప్పిశెట్టి సురేష్

కోవిడ్ కారణంగా ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆన్లైన్ తరగతులు జరుగుతున్నప్పటికి కళాశాలలు భౌతికంగా తెరుచుకునేటప్పటికి మౌళిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు, అధ్యాపకులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు కావునా మౌళిక వసతులను పెంచాలని 475 సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్రం లోని ఉన్న 404 ప్రభుత్వ జూనియర్ కళాశాల లో దాదాపు 2 లక్షల పైచిలుకు బడుగు బలహీన దళిత వర్గాల విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

ప్రధాన సమస్యలు ::

  • Covid 19 నేపథ్యంలో పరిశుభ్రత ప్రధాన అంశం కాబట్టి ప్రతి కళాశాలలో బాలబాలికలకు వేరువేరుగా టాయిలెట్స్ నిర్మించాలి. మరియు వాటి నిర్వహణకోసం స్కావెంజర్స్ ను నియమించాలి.
  • చాలా కళాశాలలు పాత భవనాలు, రేకుల షెడ్ లో ఉన్నాయి వెంటనే వీటి స్థానంలో నూతన భవనాలు నిర్మించడానికి ఆదేశాలు జారీ చేయాలి.
  • నాన్ టీచింగ్ సిబ్బంది మరియు అటెండర్ లో కూడా లేని కళాశాలలు చాలా ఉన్నాయి. వెంటనే వీరిని నియామకానికి చర్యలు తీసుకోవాలి
  • విద్యార్థులకు శానిటైజర్ లు మాస్క్ లను ఉచితంగా కళాశాలలో అందించాలి.
  • చాలా కళాశాలల్లో ఏర్పాటు చేయబడ్డ మినరల్ వాటర్ ప్లాంట్లు మరమ్మతులకు లోనయి పనిచేయడం లేదు. వెంటనే వాటికి మరమ్మతులు చేయాలి మరియు లేని కాలేజీలలో ఏర్పాటు చేయాలి
  • చాలా కళాశాలలు కంప్యూటర్లు, ప్రింటర్లు లేవు వెంటనే ఏర్పాటు చేయాలి. ఆన్లైన్ తరగతుల నిర్వహణ కోసం కంప్యూటర్ ల్యాబ్ ను ఏర్పాటు చేయాలి