కాంట్రాక్టు అధ్యాపకుల రెన్యువల్ ఉత్తర్వులు జారీపై 475 సంఘం హర్షం

తెలంగాణ రాష్ట్రలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు 2021 – 22 విద్యా సంవత్సరానికి రెన్యువల్ ఉత్తర్వులు రావడం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణ రెడ్డి, డాక్టర్. కొప్పిశెట్టి సురేష్ హర్షం వ్యక్తం చేశారు.

కొద్దిసేపటి క్రితం ఆర్థిక శాఖ జీవో1294 వివిధ ప్రభుత్వ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న 3686 కాంట్రాక్టు లెక్చరర్ లతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారిని మొత్తం 4086 ఈ విద్యా సంవత్సరం రెన్యువల్ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వస్కుల శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శోభన్ బాబు ప్రచార కార్యదర్శి జబీ ఉల్లా ధన్యవాదాలు తెలిపారు.