కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో న్యాయం,ధర్మం గెలిచాయి. – డాక్టర్ కొప్పిశెట్టి, డాక్టర్ వస్కుల శ్రీనివాస్.

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 16 పై కొందరు కుట్రపూరితంగా వేసిన కేసులలో చివరకు న్యాయం, ధర్మమే గెలిచాయని తెలంగాణ గవర్నమెంట్ కాలేజెస్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్,సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు డాక్టర్ వస్కుల శ్రీనివాస్ అన్నారు.

కాంట్రాక్ట్ ఉద్యోగుల సుదీర్ఘ న్యాయ పోరాట ఫలితమే నేటి కోర్టు తీర్పు అని న్యాయాన్ని ,ధర్మాన్ని కాపాడిన లాయర్లకు,ప్రభుత్వ పెద్దలకు, న్యాయ వ్యవస్థకు డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ ,డాక్టర్ వస్కుల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కొంత మంది నిరుద్యోగుల పేరిట కుట్రపూరితంగా పిల్ నెం. 122/2017 వేసి కోర్టు సమయాన్ని వృధా చేయడమే కాకుండా తెలంగాణా రాష్ట్రం లో దాదాపు ఎనమిది సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ కాకుండా కుట్రపూరితంగా అడ్డుకోవడంతో చాలా మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ కాకుండానే మనోవేదనతో చనిపోయారని సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

హైకోర్ట్ మంగళవారం పిల్ నేం.122/2017 కొట్టివేయడమే కాకుండా కేసు వేసిన వారికి జరిమానా విధించి న్యాయాన్ని గెలిపించడం శుభపరిణామం అన్నారు.తెలంగాణ రాష్ట్రం లో కాంట్రాక్టు ఉద్యోగుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి అయినందున తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కు చర్యలు చేపట్టాలని కొప్పిశెట్టి సురేష్, వస్కుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Follow Us @