హైదరాబాద్ (సెప్టెంబర్ – 09) : ఆసియా కప్ లో భాగంగా అప్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli ) తన టీట్వంటీ ఇంటర్నేషనల్ మొదటి సెంచరీ సాదించాడు. అలాగే ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో 71వ సెంచరీ సాదించి సచిన్ (100 సెంచరీలు) తర్వాత పాటింగ్ (71 సెంచరీలు) తో కలిసి అత్యధిక ఇంటర్నేషనల్ సెంచరీలలో రెండో స్థానానికి చేరాడు.
మరోవైపు జ్యురిచ్ లో జరుగుతున్న డైమండ్ లీగ్ జావెలిన్ త్రో పోటీలలో మొట్టమొదటి సారి నీరజ్ చొప్రా (niraj Chopra) బంగారు పథకం సాదించాడు. 88.44 మీటర్లు త్రో చేసి ఈ టైటిల్ నెగ్గిన మొట్టమొదటి భారతీయుడుగా రికార్డు సృష్టించాడు.