రాణి ఎలిజబెత్ ఎవరికి “నైట్ హుడ్” హోదా కల్పించారు.?

బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్‌ మరియు మంత్రి బరోనెస్ వలేరీ అమోస్ లకు బ్రిటన్ అత్యున్నత పౌర పురష్కారం నైట్ హుడ్ హోదా కల్పిస్తూ రాణి ఎలిజబెత్ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వీరు.. ‘ఆర్డర్ ఆఫ్ గార్డర్’ సభ్యులుగా కొనసాగుతారు.

అవిశ్రాంతంగా ప్రజాసేవ చేసిన వారిని బ్రిటిష్ ప్రభుత్వం 1348వ సంవత్సరం నుంచి ఇలా నైట్‌హుడ్ హోదాతో గౌరవిస్తోంది. ఇకపై “సర్” తో గౌరవంగా సంబోధిస్తారు.

  • 68 ఏళ్ల టోనీ బ్లెయిర్ 1997 నుంచి పదేళ్లపాటు బ్రిటనకు ప్రధానిగా సేవలందించారు.
  • బ్రిటన్ మాజీ మంత్రి, నల్ల జాతీయురాలు బరోనెస్ వలేరీ అమోస్(67)కు సైతం నైట్‌హుడ్ హోదా దక్కింది.
  • గృహ హింస, లైంగిక వేధింపులపై అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలతో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్న రాణి కోడలు అయినా కమిల్లాను ‘ రాయల్ కంప్యానియన్’గా నియమిస్తూ ఎలిజబెత్ రాణి నిర్ణయం తీసుకున్నారు.