BIKKI NEWS (JAN. 26) : khammam TGOS Meet Deputy CM Bhatti Vikramarka. తెలంగాణ రాష్ట్రఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు ను తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఖమ్మం జిల్లా శాఖ కలిసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. TGO ఖమ్మం జిల్లా డైరీ 2025 వారిచే ఆవిష్కరణ చేయడం జరిగింది.
khammam TGOS Meet Deputy CM Bhatti Vikramarka
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు గెజిటెడ్ అధికారుల సంక్షేమం కోసం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.
వీడివోస్ కాలనీలో ప్రస్తుతం ఉన్న టీజీవో భవనము ను పర్మనెంట్ గా ఇవ్వవలసిందిగా కొరుచూ గెజిటెడ్ ఉద్యోగుల సంక్షేమం కొరకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకొనుటకు నిధులు కేటాయించమని అభ్యర్థించడం జరిగింది.
తెలంగాణ గెజిటెడ్ అధికారుల హౌస్ బిల్డింగ్ సొసైటీ ద్వారా రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్స్ ని గెజిటెడ్ అధికారులకు గవర్నమెంట్ నామినల్ రేటు ప్రకారంగా ఇవ్వవలసిందిగా కోరనైనది.
పై రెండు అంశాల పైన డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సానుకూలంగా స్పందిస్తూ.. రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్స్ విషయంలో మేము అడుగుతున్న రేట్ల విషయంలో వారు సలహా ఇస్తూ వాటిని ఏ విధంగా గెజిటెడ్అధికారులు కు ఇస్తే అనుకూలంగా ఉంటదో రిప్రజెంటేషన్ ఇవ్వవలసిందిగా సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి అసోసియేట్ ప్రెసిడెంట్ వాసిరెడ్డి శ్రీనివాస్ ట్రెజరర్ కొండపల్లి శేషు ప్రసాద్ ఉమెన్ వింగ్ అధ్యక్షురాలు శ్రీమతి గుంటుపల్లి ఉషశ్రీ కార్యదర్శి శ్రీమతి పి సుధా రాణి గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బాబు రత్నాకర్ పబ్లిసిటీ సెక్రటరీ శ్రీమతి అరుణకుమారి సంయుక్త కార్యదర్శి డాక్టర్ బానోత్ రాంబాబు డాక్టర్ బెజవాడ సైదులు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి జహీరుద్దీన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కార్యదర్శి తమ్మిశెట్టి శ్రీనివాస్ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్