కేజీబీవీ ఉద్యోగుల తక్షణమే బేసిక్ పే కోసం రాష్ట్రవ్యాప్త నిరసన – గుంటి గోపిలత

నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీబీవీ ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ప్రకటించడం జరిగింది. ఎన్నికలకు ముందు రెగ్యులర్ చేస్తామన్న హమీ ఇచ్చి రెండవ దఫా ముఖ్యమంత్రి అయ్యి కూడా మమ్మల్ని రెగ్యులర్ చేయకపోగా కనీస వేతనం అమలు చేయకపోవడం దారుణమని గోపిలత అన్నారు.

24 గంటలు కేజీబీవీ లలో విరామమెరుగక శ్రమిస్తున్న మా కేజీబీవీ ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి మాకు బేసిక్ పే తో పాటుగా prc అమలు చేసి మా బతుకులకు ఆపద్బంధువై నిలవాలని కోరుతూ..మా చెమట చుక్కల్ని గుర్తించాలని ఇవాళ భోజన విరామ సమయాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475 పాఠశాలల్లో సీఎం సారుకు మా రక్తపు చుక్కలతో రక్తాభిషేకం చేసి నిరసన తెలుపుతున్నామని గోపీలత తమ ఆవేదన వ్యక్తంచేశారు.


ఇప్పటికైనా ముుఖ్యమంత్రి తక్షణమే కేజీబీవీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత దిశగా చర్యలు చేపట్టకపోతే మా నిరసనలు,ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని TSUTF రాష్ట్ర కమిటీ మెంబర్ గుంటి గోపిలత హెచ్చరించారు.


Follow Us @