కస్తూర్బా గాంధీ పాఠశాలల టీచర్లకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పిస్తూ ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) లలో పనిచేస్తున్న మహిళ కాంట్రాక్టు టీచర్లకు వేతనంతో కూడిన 180 రోజులు ప్రసూతి సెలవులను కల్పిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

వివాహిత అయిన కాంట్రాక్టు టీచర్ మొదటి రెండు ప్రసవాలకు 180 రోజుల చొప్పున పూర్తి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. ఈ 180 రోజుల కాలాన్ని ఆన్ డ్యూటీ గా పరిగణించి ఆ కాలానికి సంబంధించిన EPF, ESI వంటి బెనిఫిట్ లను కూడా ఆన్ డ్యూటీ గా పరిగణించి చెల్లించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులు పేర్కొంది.

Follow Us @