హైదరాబాద్ (మే – 03) : తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (KGBV)లోని కాంట్రాక్ట్ ఉద్యోగులను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు విద్యాశాఖ బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది.
స్పెషల్ ఆఫీసర్లు, పీజీసీఆర్ టీలు, సీఆర్డీలు, ఏఎన్ఎంలు, అకౌంటెంట్లు, పీఈటీలు బదిలీల కోసం మే 6 నుంచి
9 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన సూచించారు.