హైదరాబాద్ (మార్చి 22) : దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2022 – 24 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి మరియు ఖాళీగా ఉన్న రెండో తరగతి నుండి పై తరగతులకు ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రెండు ఆపై తరగతిలో అడ్మిషన్లకు ప్రత్యక్షంగా దరఖాస్తు సంబంధించిన పాఠశాలల్లో సమర్పించవలసి ఉంటుంది.
ఒకటో తరగతి అడ్మిషన్లు ఆన్లైన్ ద్వారా మార్చి 27 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై… దరఖాస్తు చేయడానికి చివరి ఏప్రిల్ 17 వరకు కలదు.
ఒకటో తరగతిలో అడ్మిషన్స్ కోసం కనీస వయస్సు మార్చి 31 – 2023 నాటికి 6 సంవత్సరాలుగా ఉండాలి.
ఒకటో తరగతి అడ్మిషన్లు పొందిన అభ్యర్థుల జాబితాలను ఏప్రిల్ 20న మొదటి, 28న రెండో, మే 5న మూడో జాబితా ద్వారా సీట్లు పొందిన వారి పేర్లను ప్రకటిస్తారు.
రెండు ఆపై తరగతుల కు అడ్మిషన్లు విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఖాళీగా సీట్ల సంఖ్యను బట్టి ఉంటుంది. ఈ అడ్మిషన్లను ప్రత్యక్షంగా విద్యాలయాలను సందర్శించి చేసుకోవలసి ఉంటుంది. ఏప్రిల్ 3 నుండి 12 వరకు రెండు ఆపై తరగతుల అడ్మిషన్ల ప్రక్రియ జరగనుంది.
వెబ్సైట్ : https://kvsangathan.nic.in/