గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

తెలంగాణ కవి, రచయిత గోరటి వెంకన్నను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2020-21 ఏడాదికి సంబంధించి ఆయన రాసిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి గానూ వరించింది.

గోరటి వెంకన్నతో పాటు తూగుళ్ల గోపాల్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం, దేవరాజు మహారాజును బాలసాహిత్య అవార్డు వరించింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా గౌరారంలో 1963లో జన్మించిన గోరటి వెంకన్న… ‘వల్లంకి తాళం’తో పాటు అచ్చమైన పల్లెపదాలతో ఏకునాదం మోత, రేలపూతలు, అల సెంద్రవంక, పూసిన పున్నమి తదితర పుస్తకాలు రచించారు.

2021కి గానూ మొత్తం 20 భాషలకు సంబంధించి ఈ అవార్డులను ప్రకటిస్తున్నట్లు సాహిత్య అకాడమీ పేర్కొంది. గుజరాత్‌, మణిపురి, మైతిలి, ఉర్దూ భాషలకు సంబంధించి అవార్డులను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. త్వరలో నిర్వహించబోయే అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పురస్కారంతో పాటు, నగదు బహుమతిని అందజేస్తామని అకాడమీ పేర్కొంది

Follow Us @