నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖలోని ఉద్యోగ ఖాళీలను వెంటనే గుర్తించి నివేదిక ఇవ్వాలని సీఎస్ ను ఆదేశించారు.

ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తి చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సీఎం శ్రీ కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

ఇంకా ఏఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలి. అలా లెక్క తేలిన తర్వాత వాటిని భర్తీ చేయడం కోసం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Follow Us@