వరంగల్ లోని MGM లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ లను సీఎం కేసీఆర్ ఇవాళ పరామర్శించారు. కొవిడ్ వార్డుల్లో కోవిడ్ పేషెంట్ లతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు సీఎం కేసీఆర్.
వరంగల్ పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం ఎంజీఎం హస్పిటల్ కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. నేరుగా కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగులను పరామర్శించారు. కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు.
Follow Us@