విద్యార్థులకు కేసీఆర్ ఫెలోషిప్

తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలలో పీహెచ్డీ చేసే విద్యార్ధులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేరు మీద ఫెలోషిప్ ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఏ ఇతర ఆర్థికసాయం పొందని విద్యార్ధులకు దీన్ని అందజేయాలని అధికారులు ప్రతిపాదనలలో తెలిపారు.

‘కేసీఆర్ డాక్టోరల్ ఫెలోషిప్’ పేరుతో దీన్ని అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారని, ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఏడాదికి 5 కోట్లు వరకు ఈ ఫెలోషిప్ కు అవసరం కానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.

ఇప్పటికే రాజీవ్ గాంధీ ఫెలోషిప్ పేరుతో SC, ST, BC విద్యార్థులకు ఫెలోషిప్ అందుతున్న విషయం తెలిసిందే.

Follow Us @