కెసిఆర్ నోట గాదె వెంకన్న మాట

ఖమ్మం – నల్గొండ – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండవసారి గెలుపొందిన నేపథ్యంలో ఆర్జేడీ నియమిత కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం పల్లాను కలిసి సన్మానించి, శుభాకాంక్షలు తెలిపే సందర్భంగా “చిరుద్యోగుల పక్షపాతి కేసీఆర్ ” అనే శీర్షిికను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చదివి ఆర్టికల్ చాలా అద్భుతంగా ఉందని, మొత్తం ఆర్టికల్ చదివి వివరాలు అడగడం జరిగిందని, దానికి బదులుగా గాదె వెంకన్న ఆర్జేడి కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పడం జఠిగిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి RJD సంఘం నాయకులు సమక్షంలో గాదె వెంకన్న తో పంచుకున్నారు.

ఆర్టికల్ చాలా అద్భుతంగా ఉందని వాస్తవాలను కళ్లకు కట్టినట్లు రాసాడని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వంటి ఉద్యోగుల సాదకబాదకాలను వివరించిన తీరు ఆకట్టుకుందని సీఎం కేసీఆర్ అన్నట్లు తెలియజేశారు. ముఖ్యంగాచంద్రబాబు హయాంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను గుర్రాలతో తొక్కిస్తే , చంద్రశేఖర రావు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను గుర్రాలనెక్కించిన అల్లిక అద్భుతమైన కూర్పుగా పేర్కొన్నట్లు గాదె వెంకన్న తో పల్లా గారు చెప్పారు.

చిరు ఉద్యోగులైన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తాత్కాలిక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం కేసీఆర్ చూపుతున్న చొరవను వివరిస్తూ 20 ఏళ్ల కిందట పురుడు పోసుకుని శ్రమ దోపిడీకి నిలువెత్తు నిదర్శనమైన కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి వారికి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా జీతాలు సౌకర్యాలు కల్పించడం కాకుండా తెలంగాణ తొలి పిఆర్సి లో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కల్పించి వారితో పాటే పీఆర్సీ అమలు చేయడం చరిత్రాత్మకమని గాదె వెంకన్న పేర్కొన్నారు.

నిజంగా కేసీఆర్ చిరు ఉద్యోగుల పక్షపాతి అని ప్రాణం ఉన్నంత కాలం సీఎం కేసీఆర్ తోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు ఆరున్నర లక్షల మంది కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ , తాత్కాలిక ఉద్యోగులు నడుస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఏదేమైన్నా కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్ ఉద్యోగులపై గాదె వెంకన్న రాసిన ఆర్టికల్ యావత్ చిరుద్యోగుల అందరిని ఆకట్టుకున్న విషయంగా…

కాంట్రాక్ట్ అధ్యాపకుల పక్షాన హ్యాట్సాప్ గాదె.

Follow Us @