కరీంనగర్ నిరుద్యోగులకు శుభవార్త

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండల కేంద్రంలోని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(SBI – RESTI). ఈ కేంద్రం ద్వారా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా యువతకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణను అందిస్తూ ఉపాధికి బాటలు వేస్తున్నారు. ఈ శిక్షణ కేంద్రాన్ని 2010లో తిమ్మాపూర్‌ మండల కేంద్రంలో నెలకొల్పారు.

శిక్షణ పూర్తిగా రెసిడెన్షియల్‌ విధానంలో కొనసాగుతుంది. ఉచిత భోజనం, వసతి కూడా కల్పిస్తారు. అనుభవజ్ఞులతో అవగాహన కల్పిస్తూ, వీలు దొరికినప్పుడల్లా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. శిక్షణ సమయంలో ఆయా అంశాలపై పట్టుకోసం పీల్డ్ విజిటింగ్ లు కల్పిస్తున్నారు. ఏడాదికి 700 మందికి శిక్షణ ఇస్తూ అనంతరం సర్టిఫికెట్ లను అందచేసి, బ్యాంకు నుంచి రుణ సౌకర్యాన్ని కల్పిస్తుండటం విశేషం.

అర్హతలు ::

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందినవారై ఉండాలి.
కనీస విద్యార్హత పురుషులకు 7వ తరగతి, స్త్రీలకు 5వ తరగతి ఉండాలి. తెలుగులో రాయడం, చదవడం రావాలి. వయస్సు 18 నుంచి 35 సంవ‌త్స‌రాల్లోపు ఉండాలి.

Follow Us@