ఎమ్మెల్సీ వాణీ దేవి విజయం పట్ల 711 సంఘం హర్షం.

హైదరాబాద్ – రంగారెడ్డి – మహాబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలో అపూర్వ విజయం సాదించిన వాణీ దేవి కి 711 సంఘం తరపున కనకచంద్రం శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కనకచంద్రం మాట్లాడుతూ ఈ ఎన్నికల ఇన్ చార్జీ గా ఉన్న మంత్రి హరీష్ రావు మరియు ఇంటర్విద్యా జేఏసీ చైర్మన్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకులు మరియు అధ్యాపకుల పూర్వ విద్యార్థులు శ్రీమతి వాణి దేవి గెలుపుకు సహకరించినటువంటి మన సంఘ జిల్లా నాయకులకు అధ్యాపక బృందానికి మరియు పూర్వ విద్యార్థులకు మరొక్కసారి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 711 సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనక చంద్రం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కడారి శ్రీనివాస్, హైదరాబాద్ అధ్యక్షురాలు మాలతి, మహబూబ్ నగర్ అధ్యక్షులు వెంకట్ రాములు, గద్వాల అధ్యక్షులు పవన్ కుమార్,వనపర్తి అధ్యక్షులు గోపాల్, నాగర్ కర్నూల్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Follow Us@