సీజేఎల్స్ సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లిన కనకచంద్రం

తెలంగాణ రాష్ట్రం లో పని చేస్తున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల తరపున 711 సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం మరియు సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు శనిగరం. శ్రీనివాస్ ప్రగతి భవన్ లో రాష్ట్ర IT మరియు భారీ పరిశ్రమల శాఖ మాత్యుడు మరియు TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల రామారావును కలిసి కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల పలు సమస్యలపై చర్చించడం జరిగింది

అందులో భాగంగా బదిలీలు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన ఇచ్చి కూడా చాలా రోజుల అవుతుందని, త్వరగా గైడ్లైన్స్ వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని కోరడం జరిగింది. మంత్రి కేటీఆర్ వెంటనే సంబంధిత మంత్రి మరియు అధికారులతో మాట్లాడుతానని వారిని కలవమని సూచించడం జరిగింది.

అలాగే కాంట్రాక్టు అధ్యాపకులు అభద్రతా భావంతో ఉద్యోగం చేస్తున్నామని, కాంట్రాక్ట్ అధ్యాపకులకు రెగ్యులరైజేషన్ పూర్తయ్యేవరకు రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని అస్సాం రాష్ట్రంలో ఇది ఇంప్లిమెంటేషన్ అవుతుందని తెలపడం జరిగింది.

మంత్రి కేటీఆర్ స్పందిస్తూ రెగ్యులరైజేషన్ విషయంలో కోర్టు కేస్ తొలగించే విదంగా కచ్చితంగా ప్రయత్నం చేస్తామని, అప్పటివరకు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల తో సమానంగా అన్ని బెనిఫిట్స్ వచ్చేలా కృషి చేస్తానని త్వరలోనే అందరితో మాట్లాడతనని ఖచ్చితంగా ఈ హామీని నెరవేరుస్తానని తెలపడం జరిగింది.

తర్వాత సిరిసిల్ల జిల్లా క్యాలెండర్ ను మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా నాయకులు కట్టయ్యా మరియు విష్ణుప్రసాద్ ,చందులు పాల్గొన్నారు

Follow Us@