కాంట్రాక్టు అధ్యాపకులకు బేసిక్ పే కల్పించిన కేసీఆర్ కి కృతజ్ఞతలు – కనకచంద్రం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న దాదాపు 5 వేల మంది కాంట్రాక్టు లెక్చరర్లకు నూతన పీఆర్సీ ప్రకారం కాంట్రాక్టు అధ్యాపకులకు బేసిక్ పే కల్పిస్తున్నట్లు స్వయంగా హరీష్ రావు పొన్ ద్వారా తెలియజేశారని కనకచంద్రం తెలిపారు.

ఈ సందర్భంగా కనకచంద్రం మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నుండి కేసీఆర్ కాంట్రాక్టు అధ్యాపకుల పక్షాన ఉన్నారని… తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తర్వాత కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ కోసం 16 జీవో విడుదల చేశారని తెలిపారు.

ప్రస్తుతం నూతన పీఆర్సీ ప్రకారం రెగ్యులర్ లెక్చరర్ లతో సమానంగా బేసిక్ పే కల్పించడంతో కేసీఆర్ కాంట్రాక్టు అధ్యాపకుల పక్షపాతి అని మరోసారి రుజువైందని కనకచంద్రం హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కూర రఘేత్తం రెడ్డి లక కాంట్రాక్టు అధ్యాపకుల తరపున కనకచంద్రం కృతజ్ఞతలు తెలియజేశారు.

Follow Us@