క్రమబద్ధీకరణ ప్రకటన పట్ల కృతజ్ఞతలు – జేఏసీ చైర్మన్ సీహెచ్ కనకచంద్రం

హైదరాబాద్ (ఫిబ్రవరి – 06) : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను మరియు కాంట్రాక్ట్ అధ్యాపకులను ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి క్రమబద్ధీకరిస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేసిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు జీవితాంతం రుణపడి ఉంటామని కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ చైర్మన్ సిహెచ్ కనక చంద్రం కాంట్రాక్ట్ అధ్యాపకులు మరియు ఉద్యోగుల తరఫున తెలియజేశారు.

ఈ సందర్భంగా ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును మరియు రైతుబంధు సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందని కనక చంద్రం తెలిపారు.

ఈ సందర్భంగా కనకచంద్రం మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కాంట్రాక్టు అధ్యాపకుల సేవలను గుర్తించి వెంటనే తెలంగాణ ప్రభుత్వం 12 నెలల వేతనం అలాగే బేసిక్ పే ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 61 సంవత్సరాలు పెంచి వారితో సమానంగా కాంట్రాక్ట్ అధ్యాపకులకు 61 సంవత్సరాలు వరకు సర్వీస్ కొనసాగింపు చేయడం జరిగిందని
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు బలోపేతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ గారు ఎన్నో చర్యలు తీసుకోవడం జరుగుతుందని అందులో భాగంగా కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయంలో ప్రతిపక్ష పార్టీలు నిరుద్యోగుల పేరుతో ఎన్నో రకాల కేసులు వేసినా… త్వరలోనే కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరణ చేస్తున్నామని ప్రకటించడం జరిగిందని తెలిపారు.

దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నో రకాల బెనిఫిట్స్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని… బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయినట్లయితే పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అధ్యాపకులతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులందరికీ క్రమబద్ధీకరణ చేసి వారి జీవితాలలో వెలుగు నింపుతారని దేశంలోని విద్యావంతులందరూ ఆశిస్తున్నారని పేర్కొన్నారు. అలాగేదేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు స్థాపించి పేద, బడుగు, బలహీన వర్గాలకు పౌష్టికాహారంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి దేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి అనిపించుకున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణ విషయంలో కీలకపాత్ర పోషిస్తూ క్రమబద్ధీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల గౌరవ అధ్యక్షులు రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి, ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారికి, విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రా రెడ్డి గారికి, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @