సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు – కనకచంద్రం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న దాదాపు 3600 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు రెగ్యులర్ లెక్చరర్ల తో సమానంగా పి ఆర్ సి ని 30 శాతం పిట్మెంట్ తో ఏప్రిల్ 1 నుండి అమలు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంపై జూనియర్ అధ్యాపకుల సంఘం నేతలు కనక చంద్రం ఒక ప్రకటనలో సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

చరిత్ర లో ఇప్పటివరకు కేవలం రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే పిఆర్సి అమలవుతుంది, కానీ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మొదటిసారి సీఎం కెసిఆర్ నేతృత్వంలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు అధ్యాపకులు పిఆర్సి అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు కనక చంద్రం తెలిపారు.

ఈ సందర్భంగా కనక చంద్రం మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కాంట్రాక్టు అధ్యాపకుల పక్షపాతి అని, మొదటి నుండి కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఉన్నారని ఎలాంటి సమస్యనైనా వెంటనే పరిష్కరించడానికి నిర్ణయం తీసుకుంటున్నారని తెలిపారు. అలాగే క్రమబద్దీకరణ కోసం విడుదల చేసిన జీవో 16 ను కూడా త్వరలోనే న్యాయపరమైన చిక్కులు నుండి విడిపించి క్రమబద్ధీకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us@