కాంట్రాక్ట్ ఉద్యోగుల బానిస సంకెళ్ల నుండి విముక్తి కల్పించిన కేసీఆర్ – కనకచంద్రం

21 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉద్యోగుల బానిస సంకెళ్ల నుండి విముక్తిని కేసీఆర్ కల్పించారని, కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు స్వతంత్రం కల్పించారని అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కాంట్రాక్టు అధ్యాపకుల జేఏసీ చైర్మన్ కనకచంద్రం తెలిపారు.

ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలో గత 21 ఏళ్లుగా అన్నీ తామై సేవలు అందించాలని దానిని గుర్తించిన సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలోనే కాంట్రాక్టు వ్యవస్థ లేని తెలంగాణాను తీర్చిదిద్దుతామని మాట ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆ మాట ప్రకారం మొదటి మంత్రి మండలి సమావేశం లోని జీవో నెంబర్ క్రమబద్దీకరణకు ఆదేశాలు జారీ చేసి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటి అన్నింటిని అధిగమించి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారని తరతరాలుగా తమ కుటుంబాలు సీఎం కేసీఆర్ కు, ఆర్థిక శాఖ మంత్రి కేటీఆర్ కు, హరీష్ రావుకు, పల్లా రాజేశ్వర్ రెడ్డి కి రుణపడి ఉంటామని తెలిపారు.

Follow Us @