సీజేఎల్స్ రెన్యూవల్ ఉత్తర్వుల పై హర్షం వ్యక్తం చేసిన జేఏసీ చైర్మైన్ కనకచంద్రం

తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో పనిచేస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్స్ ను 2021 – 22 విద్యా సంవత్సరానికి రెన్యువల్ చేస్తూ ఈరోజు ప్రభుత్వము జీవో నంబర్ 1294 ఇవ్వడం పట్ల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ జేఏసీ చైర్మన్ సిహెచ్ కనక చంద్రం కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా కనకచంద్రం మాట్లాడుతూ రెన్యువల్ ఆలస్యమైనప్పటికీ మా యొక్క జీతాలను ముందుగానే విడుదల చేసి మాకు జీతాలు ఇప్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి అలాగే, అన్ని విధాల మమ్ములను ఆదుకుంటూ అక్కున చేర్చుకున్న మా ఆపద్బాంధవుడు సంఘ గౌరవ అధ్యక్షులు తన్నీరు హరీష్ రావుకి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నట్లు తెలిపారు
రెగ్యులర్ ఉద్యోగుల కంటే ముందుగా పిఆర్సి మాకిచ్చి మా జీవితాలలో వెలుగు నింపిన తెలంగాణ ప్రభుత్వానికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా ప్రకటించారు