నూతన అధ్యాపకులు ప్రభుత్వ కళాశాలల అభివృద్ధికి పాటుపడండి

కామారెడ్డి (జూలై – 30) : ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశానికి అతిథిగా విచ్చేసిన జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బలోపేతం చేయవలసిన బాధ్యత ప్రతి అధ్యాపకుడిపై ఉన్నదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ నూతన అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వం మన ఉద్యోగాలను క్రమబద్దీకరణ చేపట్టడం ద్వారా మనకు మరింత బాధ్యత పెరిగిందని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో మనమందరం భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు.

అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వసుకుల శ్రీనివాస్ మాట్లాడుతూ అనేక ఉద్యమాల ద్వారా ఈరోజు మంచి ఫలితాలను సాధించడం జరిగిందని ఇదే స్ఫూర్తిని ముందు ముందు కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీని ఘనంగా సన్మానించడం జరిగింది.

జిల్లా కమిటీ అధ్యక్షుడు జుబ్రే గంగాధర్, ప్రధాన కార్యదర్శి ఎండి ఇస్రాత్, గౌరవ అధ్యక్షుడు వసంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రతాప్, కిరణ్, జేట్టి విజయ్, అసోసియేట్ ప్రెసిడెంట్ శివ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు రాజగోపాల్, గంగాధర్, బాలాజీ, కోశాధికారి, ఓరం సంతోష్, సహాయ కార్యదర్శి
జి రాజు, పి నరేష్, జిల్లా మహిళా సెక్రెటరీలు సమిత, సరస్వతి, రుక్మిణి, జిల్లా అధికార ప్రతినిధి పత్తి శ్రీనివాస్, కార్యక్రమంలో వసంత్, రాజా గౌడ్, భాను, రాజు, లక్ష్మీ నారాయణ, శ్రీనివాస్, శేషారావు, లక్ష్మణ్, శివ ప్రసాద్, అశోక్ గౌడ్, సాయిబాబా, ఫకీర్, నాయక్, సంతోష్, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.