ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో MBBS, BDS కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో MBBS, BDS కోర్సుల్లో యాజమాన్య కోటాలో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (KNRUHS) నేడు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

నీట్‌ యూజీ -2020లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ ఒకటవ తేదీ ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 7వ తేదీ సాయింత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

వెబ్సైట్ :: www.knruhs.telangana.gov.in

Follow Us@