హైదరాబాద్ (సెప్టెంబర్ – 09) : ప్రజాకవి కాళోజి స్మృతిలో తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాష, తెలంగాణ సాహిత్యం కోసం విశేషంగా కృషి చేసిన వారికి ప్రతి ఏటా ఇస్తున్న ప్రతిష్టాత్మక కాళోజీ పురస్కారం 2022 కు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ప్రముఖ కవి శ్రీ రామోజు హరగోపాల్ అందుకున్నారు.
ఈ అవార్డు క్రింద రూ. లు. 1 లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయల నగదును, కాళోజీ అవార్డును, షీల్డ్ ను అందిస్తారు.