సగటు విద్యార్థులు గట్టెక్కించడమే లక్ష్యంగా బీటెక్ లో సెమిస్టర్ పరీక్షల తరహాలో మిడ్ టర్మ్‌గా పిలిచే ఇంటర్నల్ పరీక్షలకూ సప్లిమెంటరీ పరీక్షలు జరపాలని JNTUH నిర్ణయించింది. దీనివల్ల సుమారు 20వేల మంది బీటెక్ విద్యార్థులు ప్రయోజనం పొందుతారని అధికారులు చెబుతున్నారు.
సెమిస్టర్ పరీక్షల్లో తప్పితే ఏటా సప్లిమెంటరీ జరుపుతున్నారు. ఇంటర్నల్ పరీక్షలకు అలాంటి అవకాశం లేదు. ఇంటర్నల్ పరీక్షలలో తక్కువ మార్కులు తెచ్చుకొని కొన్నేళ్లుగా బీటెక్ ఉత్తీర్ణులు కానివారు సుమారు 20 వేల మంది ఉన్నారు. ఈ క్రమంలో మరొకసారి అంతర్గత పరీక్షలు నిర్వహిస్తే వారికి మేలు జరుగుతుందని JNTUH వర్గాల భావిస్తున్నాయి.
దీనిపై గత మే నెలలో జరిగిన వర్సిటీ పాలక మండలి సమావేశంలోనే సభ్యులు ఇంటర్నల్ పరీక్షలకు సప్లిమెంటరీ జరపాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. కొద్ది రోజుల్లో వర్సిటీ అధికారిక ఆదేశాలు జారీచేయనుంది.
★ బీటెక్ పాస్ కాకుంటే.. డిప్లొమా పట్టా.?
ఎన్నో ఏళ్లుగా పరీక్షలు రాస్తున్నా బీటెక్‌లో ఒకటీ రెండు సబ్జెక్టుల్లో పాస్ కాకపోవడం వల్ల కొందరు ఇంజనీరింగ్ డిగ్రీ పట్టా పొందలేకపోతున్నారు. ఇలాంటివారికి వారి మార్కులు/క్రెడిట్లను బట్టి కనీసం డిప్లొమా పట్టా ఇస్తే బాగుంటుందని అధికారులు కొందరు ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం అమోదం తెలిపితే చాలా మంది విద్యార్థులకు డిప్లొమా పట్టాలు పొంది తగిన ఉద్యోగం లో చేరే అవకాశాలు పెరుగుతాయి. తద్వారా వేలాది మంది బీటెక్ పూర్తి చేయకుండా ఉన్న విద్యార్థులకు ఈ డిప్లొమా పట్టాలు వరం కానున్నాయి.
Follow Us@