ఎంసెట్ ర్యాంక్ తో JNTUH లో ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ అడ్మిషన్లు

హైదరాబాద్ (జూలై – 02) : JNTUH మరియు BTH – SWEDEN సంయుక్తంగా అందిస్తున్న ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డబుల్ డిగ్రీ ఇంజనీరింగ్ (juntuh and bth five years integrated double degree masters programme) కోర్సులకు 2023 – 24 విద్యా సంవత్సరానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.

ఈ కోర్సుల్లో ప్రవేశాలను ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు ఎంసెట్ 2023 ర్యాంక్ మరియు జేఈఈ మెయిన్స్ 2023 ర్యాంక్ ఆధారంగా కేటాయించనున్నారు.

ఈ కోర్సుల్లో ప్రవేశం పొందిన వారు మూడున్నర సంవత్సరాలు JNTUH కూకట్ పల్లి క్యాంపస్ లోను ఒకటిన్నర సంవత్సరాలు BTH స్వీడన్ కళాశాలలో చదవాల్సి ఉంటుంది.

ECE,. CSE విభాగంలో బీటెక్ ఎంటెక్ అండ్ ఎంఎస్ కోర్సులను విద్యార్థులు ఎంచుకోవచ్చు.

◆ దరఖాస్తు విధానము– ఆన్లైన్

దరఖాస్తు గడువు – జూలై 12

1,000 రూపాయల ఆలస్య రుసుముతో – జులై 14 వరకు గడవు కలదు

విద్యార్థులకు అవగాహన సదస్సు – జులై 13న నిర్వహించనున్నారు

◆ అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ – జూలై 17వ తేదీన నిర్వహించనున్నారు

◆ వెబ్సైట్ : www.jntuh.ac.in