జూనియర్ పంచాయతీ కార్యదర్శుల వేతనం, ప్రొబేషన్ కాలం పెంపు పైల్ పై సీఎం సంతకం.!

జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు (JPS ) ల ప్రొబేషన్ టైమ్​ను రెండేళ్ల నుంచి నాలుగేళ్లకు సర్కార్ పెంచనుంది. అలాగే వారి జీతాన్ని కూడా రూ.15 వేల నుంచి రూ.30 వేలకు పెంచనుంది. దీనికి సంబంధించిన ఫైల్​పై సీఎం కేసీఆర్ సంతకం చేసినట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు కూడా వెలువడనున్నట్లు సమాచారం.

9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శులను పోస్టులను ప్రభుత్వం 2019 ఏప్రిల్ లో భర్తీ చేసింది. అప్పుడు వారి ప్రొబేషన్ కాలాన్ని రెండేళ్లుగా ఖరారు చేసి రూ.15 వేల వేతనాన్ని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ ప్రొబేషన్ కాలం పూర్తయి 2 నెలలు గడిచింది. ఈ నేపథ్యంలో గ్రామల అబివృద్ది కోసం మరో రెండేళ్ళు ప్రొబేషన్ కాలం పెంచనున్నట్లు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు.

ప్రొబేషన్ టైమ్ పెంచొద్దు :: JPS లు

ఈ నేపథ్యంలో తమకు వేతనం పెంచకున్నా పర్వాలేదని కానీ ప్రొబేషన్ కాలాన్ని మాత్రం పెంచొద్దని వేడుకుంటున్నారు. తమను గ్రేడ్- 4 పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోట్ చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు.