హైదరాబాద్ (సెప్టెంబర్ – 19) : ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న జూనియర్ లెక్చరర్లు/ లైబ్రేరియన్స్/ ఫిజికల్ డైరెక్టర్లు డిగ్రీ లెక్చరర్లుగా పదోన్నతులు (JL to DL promotions) పొందటానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఇంటర్మీడియట్ కమిషనరేట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
మూడు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకొని సంబంధిత సబ్జెక్టుల (పీజీ) 55% మార్కులతో కలిగి ఉండి, NET, SLET, PhD కలిగి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో సీనియార్టీ ప్రకారం పదోన్నతులు కల్పించనున్నారు.
ఇప్పటికే రెండుసార్లు ప్రమోషన్ పొంది తిరిగి జూనియర్ లెక్చరర్ లు గా రివర్సన్ వచ్చిన అభ్యర్థులకు అవకాశం లేదు.